S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/31/2016 - 04:25

హైదరాబాద్, మార్చి 30: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్) ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో 2.50 లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని అధిగమించింది. గురువారంతో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను సంబంధించిన బ్యాంక్ వ్యాపార లావాదేవీలను బుధవారం ఇక్కడ ఎస్‌బిహెచ్ మేనేజింగ్ డైరెక్టర్ శంతను ముఖర్జీ వెల్లడించారు. 2015-16లో బ్యాంక్ వ్యాపారం దాదాపు 2.55 లక్షల కోట్ల రూపాయలుగా ఉండొచ్చని అంచనా వేశారు.

03/31/2016 - 04:23

కాకినాడ, మార్చి 30: ఎల్లలులేని అభివృద్ధికి అవకాశమున్న పర్యాటక రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. విశాలమైన సముద్ర తీరంతోపాటు గోదావరి నది పరీవాహక తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి.

03/31/2016 - 04:19

ఒంగోలు, మార్చి 30: వేసవికాలం ప్రారంభంలోనే పాడి పరిశ్రమ ఒట్టిపోయే దశకు చేరుకుంటోంది. అనావృష్టి ఛాయలు అలుముకోవడంతో చాలాచోట్ల భూములు బీళ్లుగా మారిపోయాయి. ప్రధానంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడం, చెరువులు, కుంటల్లో సైతం నీరు లేకపోవటంతో పశు పోషకుల పరిస్థితి అగమ్యగోచరం గా తయారైంది. కొంతమంది చేసేదేమీలేక ఎలాగోలా పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తుంటే, మరికొంతమంది తమవల్ల కాదంటూ కబేళాలకు విక్రయిస్తున్నారు.

03/31/2016 - 04:19

లండన్, మార్చి 30: దేశం నుంచి వైదొలగాలన్న టాటా స్టీల్ నిర్ణయంతో బ్రిటన్ బెంబేలెత్తిపోతోంది. ఇదే జరిగితే వేలాది ఉద్యోగులు వీధినపడే అవకాశం ఉండటంతో ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ గురువారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నారు.

03/31/2016 - 04:18

న్యూఢిల్లీ, మార్చి 30: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు అపవాదును ఎదుర్కొంటున్న లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా.. ఆయన నేతృత్వంలోని ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ బ్యాంకులకు 4,000 కోట్ల రూపాయలను చెల్లిస్తామని బుధవారం ప్రతిపాదించాయి.

03/30/2016 - 04:31

న్యూఢిల్లీ, మార్చి 29: ఆన్‌లైన్ మార్కెట్ సంస్థల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక విధాన, ప్రగతి శాఖ (డిఐపిపి) మార్గదర్శకాల ప్రకారం ఈ-కామర్స్ రిటైలర్లలో 100 శాతం ఎఫ్‌డిఐకి కేంద్రం అనుమతించింది.

03/30/2016 - 04:46

సిడ్నీ, మార్చి 29: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా మదుపరులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆహ్వానించారు. ప్రస్తుతం నాలుగు రోజుల ఆసీస్ పర్యటనలో ఉన్న జైట్లీ.. మంగళవారం ఇక్కడ సిడ్నీ క్యాంపస్ ఆఫ్ ఎస్‌పి జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

03/30/2016 - 04:27

ముంబయి, మార్చి 29: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. ఈ నెలకుగాను డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనున్న క్రమంలో సూచీలకు ఒడిదుడుకులు తప్పలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య విధానంపై ఆ దేశ రిజర్వ్ బ్యాంక్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ ప్రసంగించనున్న క్రమంలో మదుపరులు తమ పెట్టుబడులపై కొంత ఊగిసలాటకు గురయ్యారు.

03/30/2016 - 04:27

న్యూఢిల్లీ, మార్చి 29: సహారాకు చెందిన పలు ఆస్తులను అమ్మేయాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సుప్రీం కోర్టు మంగళవారం తెలిపింది. మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించి మదుపరుల నుంచి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు భారీగా నిధులను సమీకరించాయన్న కేసులో గత రెండేళ్ల నుంచి సహారా అధినేత సుబ్రతా రాయ్ జైళ్లో ఉంటున్నది తెలిసిందే.

03/30/2016 - 04:26

న్యూఢిల్లీ, మార్చి 29: వాహనదారులపై బీమా భారం మరింత పెరగనుంది. కార్లు, బైక్‌లు తదితర వాహనాల బీమా ప్రీమియంలు వచ్చే నెల 1 నుంచి 40 శాతం పెరుగుతున్నాయి మరి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) నుంచి వాహన బీమా ప్రీమియంలను పెంచాలని బీమారంగ రెగ్యులేటర్ ఐఆర్‌డిఎఐ నిర్ణయించడంతో ఏప్రిల్ 1 నుంచి మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలకు రెక్కలు రానున్నాయి.

Pages