S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/23/2016 - 04:31

హైదరాబాద్, ఏప్రిల్ 22: వచ్చే మూడేళ్లలో ప్రపంచ స్ధాయిలో హైదరాబాద్ ఐటి రంగం అగ్రగామిగా ఎదుగుతుందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం దేశంలో ఐటి రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్ధానంలో ఉందన్నారు. నిరుడు రూ. 67 వేల కోట్ల విలువ చేసే ఐటి ఎగుమతులు చేసిందన్నారు.

04/23/2016 - 04:29

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1న పేదలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 8,000 కోట్ల రూపాయల వ్యయంతో తెస్తున్న ఈ పథకం ద్వారా దేశంలోని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా 5 కోట్ల ఎల్‌పిజి కనెక్షన్లను అందించనున్నారు.

04/23/2016 - 04:28

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఆయిల్‌పామ్ ఉత్పత్తి టన్ను ధరను రూ. 7,888కి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయిల్ పామ్ డెవలపర్స్ ప్రాసెసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ గోయంగా స్వాగతించారు. గిట్టుబాటు ధర లేక పామాయిల్ రైతులు ఇక్కట్లు పాలవుతున్న సమయంలో కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ద్వారా ధరను పెంచడం వల్ల రైతులు ఉపశమనం పొందారన్నారు.

04/23/2016 - 04:27

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: భారత జిడిపి వృద్ధి ఈ ఏడాది 7.8 శాతాన్ని తాకవచ్చని అంతర్జాతీయ సంస్థ నొమురా అంచనా వేసింది. వేతన సంఘం సిఫార్సుల అమలు, సాధారణ వర్షపాతం, పెరిగే కొనుగోళ్ల శక్తి, ఉత్పాదక సామర్థ్యం మధ్య నిరుడు 7.3 శాతంగా ఉన్న దేశ జిడిపి.. ఈ ఏడాది 7.8 శాతానికి చేరుతుందని నొమురా ఓ రిసెర్చ్ నోట్‌లో శుక్రవారం పేర్కొంది.

04/23/2016 - 04:26

ముంబయి, ఏప్రిల్ 22: దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 20.2 శాతం వృద్ధి చెంది 3,374.2 కోట్ల రూపాయలుగా నమోదైంది. పెరిగిన నికర వడ్డీ ఆదాయం లాభాల్లో చెప్పుకోదగ్గ వృద్ధికి కారణమైందని శుక్రవారం బ్యాంక్ తెలిపింది.

04/23/2016 - 04:25

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశంలో అత్యంత ప్రభావవంతమైన బ్రాండ్‌గా గూగుల్ నిలిచింది. గ్లోబల్ రిసెర్చ్ సంస్థ ఇప్సోస్ అధ్యయనం ప్రకారం ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో ఫేస్‌బుక్, జిమెయిల్, మైక్రోసాఫ్ట్, సామ్‌సంగ్ ఉన్నాయి. టాప్-5లో నిలిచిన అన్ని సంస్థలు విదేశీ సంస్థలే కావడం గమనార్హం. ఇక వాట్సప్ ఆరో స్థానంలో ఉండగా, భారత్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ ఏడో స్థానంలో నిలిచింది.

04/22/2016 - 07:46

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా రుణాల ఎగవేత కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. తన విదేశీ ఆస్తుల వివరాలను అడిగే హక్కు బ్యాంకులకు లేదని సుప్రీం కోర్టులో మాల్యా ఓ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఈ నెల 21లోగా మాల్యా, ఆయన కుటుంబ సభ్యులకు దేశ, విదేశాల్లో ఉన్న మొత్తం ఆస్తుల వివరాలను వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానం ఇంతకుముందు ఆదేశించినది తెలిసిందే.

04/22/2016 - 07:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: స్టార్టప్‌లు, ఎగుమతి, దిగుమతిదారుల సమస్యల పరిష్కారార్థం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ‘ట్విట్టర్ సేవ’ను గురువారం ప్రారంభించింది. సమస్యను తెలియపరిచిన 48 గంటల నుంచి 72 గంటల మధ్య పరిష్కారాన్ని చూపిస్తామని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్ర నిర్మలా సీతారామన్ తెలిపారు.

04/22/2016 - 07:44

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: మహిళా ఉద్యోగులకు సంబంధించి ది టైమ్స్ ప్రచురించిన జాబితాలో భారతీయ ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) టాప్-50 సంస్థల్లో చోటు సంపాదించింది. బ్రిటన్‌లో అత్యధిక ఉద్యోగిణులున్న సంస్థల్లో టిసిఎస్ కూడా ఉందని ది టైమ్స్ పేర్కొంది. టిసిఎస్‌లో ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా మహిళలు పనిచేస్తున్నారు. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో ఇది మూడో వంతుకు సమానం.

04/22/2016 - 07:44

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలోగల జవహర్ ఖని-5 ఓపెన్ కాస్ట్ బొగ్గు గని విస్తరణకు పర్యావరణ అనుమతి లభించింది. ప్రస్తుతం ఏడాదికి 2 మిలియన్ టన్నులు న్న ఉత్పత్తిని 2.50 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు సింగరేణి సంస్థకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతిని మంజూరు చేసింది. షరతులు వర్తిస్తాయని పేర్కొంది.

Pages