S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/26/2016 - 00:58

ముంబయి, ఏప్రిల్ 25: బ్యాంకులు గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గించేలా కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తగ్గించాలని నిర్మాణరంగ వ్యాపార వర్గాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇండ్లు, ఫ్లాట్లు, భూముల ధరలు తగ్గిస్తే కొనుగోళ్లు పెరుగుతాయని సూచిస్తున్నారు ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్. సోమవారం ఇక్కడ వైబి చవాన్ మెమోరియల్‌లో ప్రసగించిన రాజన్.. ధరలు తగ్గితే కొనుగోలుదారులు పెరుగుతారన్నారు.

04/25/2016 - 07:53

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ).. భారత ద్రవ్యవిధానానికి మూల స్తంభం. అలాంటి ఆర్‌బిఐకి గవర్నర్ రఘురామ్ రాజన్ బాస్. అయితే హోదా పరంగా ఆర్‌బిఐలో రాజన్ అత్యున్నత వ్యక్తి కావచ్చుగానీ, వేతనం విషయంలో మాత్రం కానేకాదు. అవును మరి.. ఆర్‌బిఐలో రాజన్ కంటే ఎక్కువగా జీతాలు తీసుకునే ఉద్యోగులున్నారు.

04/25/2016 - 07:50

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఎస్‌బిఐలో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారా? అయితే మీ లోన్లు, క్రెడిట్ కార్డు చెల్లింపుల వివరాలు అంతా సరిగ్గా ఉన్నాయా? అని తప్పక చూసుకోండి. ఎందుకంటే జూనియర్ అసోసియేట్లు (కస్టమర్ సపోర్ట్, సేల్స్), క్లరికల్ కేడర్‌లో జూనియర్ అగ్రికల్చరల్ అసోసియేట్స్ నియామకాల్లో ఇప్పుడు దరఖాస్తుదారుల క్రెడిట్ పూర్వాపరాలను పరిశీలిస్తోంది ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం.

04/25/2016 - 07:48

లండన్, ఏప్రిల్ 24: బ్రిటన్ కుబేరుల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఆదివారం విడుదలైన బ్రిటన్ వార్షిక ధనవంతుల జాబితాలో భారత సంతతి సోదరులు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ‘ది సండే టైమ్స్’ సంపన్నుల జాబితా 2016లో 13.1 బిలియన్ పౌండ్లతో ముంబయికి చెందిన డేవిడ్ రూబెన్, సిమన్ రూబెన్ సోదర ద్వయం అగ్ర స్థానంలో ఉంది.

04/25/2016 - 07:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్, ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకితోపాటు యాక్సిస్ బ్యాంక్, ఐడియా సెల్యులార్ తదితర అగ్రశ్రేణి సంస్థలు ఈ వారం తమ జనవరి-మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి.

04/25/2016 - 07:46

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పాస్‌పోర్టును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడిన మాల్యా.. చెప్పాపెట్టకుండా విదేశాలకు చెక్కేసినది తెలిసిందే.

04/24/2016 - 06:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్నప్పటికీ గత నెలలో విదేశీ ఆస్తులను కొనుగోలు చేశారు. టెలివిజన్ కథనాల ప్రకారం అమెరికాలోగల న్యూయా ర్క్ నగరంలోని మాన్‌హట్టన్‌లో ఉన్న సుప్రసిద్ధ ట్రంప్ ప్లాజాలో ఓ అపార్టుమెంట్‌ను మాల్యా 10 మిలియన్ డాలర్లతో సొంతం చేసుకున్నారు. 2010లో ప్లాజాలోని పెంట్ హౌస్‌ను కొనుగోలు చేసిన మాల్యా..

04/24/2016 - 06:40

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) 43,115 కోట్ల రూపాయలను వసూలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ భారీ లక్ష్యాన్ని సాధించేందుకు వాణిజ్య పన్నుల శాఖ ఇప్పుడు కుస్తీ పడుతోంది. మిగిలిన అన్ని శాఖల కన్నా వాణిజ్య పన్నుల శాఖలో వృద్ధి అధికంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం 43 వేల కోట్ల రూపాయలకుపైగా లక్ష్యం నిర్ణయించారు.

04/24/2016 - 06:39

హైదరాబాద్, ఏప్రిల్ 23: సెట్విన్ వాణిజ్య, ఉత్పాదక కేంద్రాలకు స్టేషనరీ, పుస్తకాలు, ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన ఫైల్స్ తయారు చేసే బాధ్యతను అప్పగిస్తే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలంగాణ ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి పద్మారావు అన్నారు. ఈ మేరకు తగిన విధి విధానాలతో నివేదికను సమర్పించాలని అధికారులకు సూచించారు.

04/24/2016 - 06:39

ముంబయి, ఏప్రిల్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారం లాభాల్లో ముగిశాయి. మెటల్, బ్యాంకిం గ్, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించిన నేపథ్యంలో గడచిన వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 211.39 పాయింట్లు పెరిగి 25,838.14 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 48.85 పాయింట్లు అందిపుచ్చుకుని 7,899.30 వద్ద నిలిచింది.

Pages