S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/16/2016 - 02:34

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశీయ ఎగుమతులు ఇంకా కోలుకోవడం లేదు. వరుసగా 14వ నెల క్షీణిస్తూ, గత నెల జనవరిలో 21 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గత ఏడాది జనవరితో పోల్చితే ఇది 13.6 శాతం తక్కువ కావడం గమనార్హం. పెట్రోలియం, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు దిగుమతులు కూడా 11 శాతం తగ్గి 28.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్య లోటు 7.63 బిలియన్ డాలర్లుగా ఉంది.

02/16/2016 - 02:33

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఉచిత బీమా సేవలను వినియోగించుకుంటున్న తమ వినియోగదారుల సంఖ్య 20‚లక్షలకు చేరిందని టెలినార్ ఇండియా సంస్థ తెలిపింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ సోమవారం తెలిపారు. సురక్షా ఉచిత బీమా పేరుతో తమ వినియోగదారులకు ఈ బీమా అందిస్తున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లోని 265 రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా ఈ బీమా సేవలను పొందవచ్చని పేర్కొన్నారు.

02/16/2016 - 02:32

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భారత జిడిపి వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో 7.8 శాతంగా నమోదు కావచ్చని జపాన్‌కు చెందిన ఆర్థిక రంగ దిగ్గజం నొమురా అంచనా వేసింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, దేశంలో పెట్టుబడులపై మదుపరులలో కొనసాగుతున్న నిరాసక్తి తదితర అంశాలు భారత జిడిపి వృద్ధికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయని సోమవారం నొమురా పేర్కొంది.

02/16/2016 - 02:32

ముంబయి, ఫిబ్రవరి 15: వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 568 పాయింట్లు పుంజుకోగా, గడచిన ఏడాదికిపైగా కాలంలో ఒక్కరోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.

02/16/2016 - 02:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: సోమవారం సాధారణ ట్రేడింగ్ అనంతరం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు నిర్వహించిన ప్రభుత్వ బాండ్ల వేలానికి విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి అధిక స్పందన లభించింది. 3,011 కోట్ల రూపాయల విలువైన బాండ్లను వేలానికి వేయగా, 3,448 కోట్ల రూపాయల విలువైన దరఖాస్తులు ఎఫ్‌పిఐల నుంచి వచ్చాయి.

02/16/2016 - 02:29

ముంబయి, ఫిబ్రవరి 15: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసిన నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే మదుపరుల సంపద 2.52 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. సెనె్సక్స్ 568 పాయింట్లు పుంజుకున్న క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోని సంస్థల మార్కెట్ విలువ 2.52 లక్షల కోట్ల రూపాయలు ఎగిసి 88,62,680 కోట్ల రూపాయలకు చేరింది.

02/16/2016 - 02:29

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్‌గా యుకె సిన్హా పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. ఈ నెల 17తోనే సిన్హా పదవీ కాలం ముగియాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్న కేబినెట్ నియామకాల కమిటీ.. సిన్హా పదవీ కాలాన్ని ఏడాదికిపైగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

02/16/2016 - 02:28

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: వ్యక్తిగత ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితిని 2.5 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయలకు పెంచాలని పారిశ్రామిక సంఘం అసోచామ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే విద్య, వైద్య ఖర్చుల కోసం చేసే పొదుపు, ఇతరత్ర పన్ను అలవెన్సులకు కూడా అదనంగా ప్రోత్సాహకాలివ్వాలని మోదీ సర్కారును డిమాండ్ చేసింది.

02/15/2016 - 02:12

ముంబయి, ఫిబ్రవరి 14: బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలను ప్రభుత్వం తేనుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ‘రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ రంగ సంస్కరణలను దశలవారీగా ప్రకటిస్తాం.’ అని ఆదివారం ఇక్కడ మేక్ ఇన్ ఇండియా వీక్‌లో భాగంగా జరిగిన సిఎన్‌ఎన్ ఆసియా బిజినెస్ ఫోరమ్ 2016లో మాట్లాడుతూ అన్నారు.

02/15/2016 - 02:09

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ఆయా సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు ముగింపు దశకు చేరడంతో ఇక మదుపరుల దృష్టి ఈ వారం ద్రవ్యోల్బణం, ఐఐపి గణాంకాలపై ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

Pages