S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/01/2016 - 05:54

ముంబయి, ఏప్రిల్ 30: వరుస రెండు వారాల లాభాలకు బ్రేక్ వేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 231.52 పాయింట్లు కోల్పోయి 25,606.62 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 49.50 పాయింట్లు పడిపోయి 7,849.80 వద్ద నిలిచింది.

05/01/2016 - 05:52

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల వాతావరణం కల్పించడం ద్వారా పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా మంచి ర్యాంకు సాధించాలని టిఎస్ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అధికారులకు సూచించారు. గతంలో ఈ అంశంలో ప్రపంచ బ్యాంకు మంచి ర్యాంకు ఇవ్వకపోవడంతో శాఖల వారీగా అధికారులతో శనివారం ఇక్కడ కెటిఆర్ సమీక్ష జరిపారు.

04/30/2016 - 08:27

గుంటూరు, ఏప్రిల్ 29: ఆంధ్ర రాష్ట్రంలో విశాలమైన సముద్రతీర ప్రాంతంతో పాటు, ప్రసిద్ధిచెందిన దేవాలయాలు ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేస్తూనే పర్యాటక రంగానికి ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరు నగరంలో ఐటిసి ఐదు నక్షత్రాల హోటల్ నిర్మాణ పనులకు సిఎం శంకుస్థాపన చేశారు.

04/30/2016 - 08:25

విశాఖపట్నం, ఏప్రిల్ 29: అన్‌లోడింగ్‌లో గంగవరం పోర్టు రికార్డు సృష్టించింది. 24 గంటల్లో నౌకలోగల 1,56,339 లక్షల మెట్రిక్ టన్నుల నాన్-కోకింగ్ కోల్ ను అన్‌లోడింగ్ చేసి ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేవలం ఒక్క రోజులో ఈ స్థాయ అన్‌లో డింగ్ దేశంలోని ఏ పోర్టులోనూ జరగలేదని పోర్టు వర్గాలు పేర్కొన్నాయ. ప్రపంచంలోనూ పోర్టుల్లో కూడా నమోదు కాకపోవచ్చన్నారు.

04/30/2016 - 08:24

ముంబయి, ఏప్రిల్ 29: తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 3.52 శాతం పెరిగి 25,606.62 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 2.55 పాయింట్లు అందుకుని 7,849.80 వద్ద నిలిచింది. గురువారం సూచీలు భారీ నష్టాలకు లోనైన నేపథ్యంలో శుక్రవారం ఆరంభంలోనూ నష్టాలతోనే మొదలయ్యాయి.

04/30/2016 - 08:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: బంగారం ధరలు మళ్లీ 30,000 రూపాయల మార్కును తాకాయి. వరుసగా గత మూడు రోజుల నుంచి పెరుగుతున్న ధరలు.. శుక్రవారం కూడా పరుగులు పెట్టాయి. దీంతో ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 30,250 రూపాయలకు చేరింది. శుక్రవారం 350 రూపాయలు ఎగిసింది. ఫలితంగా దాదాపు రెండేళ్లలో బులియన్ మార్కెట్‌లోనే అత్యధిక స్థాయికి బంగారం ధర చేరినట్లైంది.

04/30/2016 - 08:23

ముంబయి, ఏప్రిల్ 29: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికంలో ఏకంగా 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. మొండి బకాయిలు (నికర నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) పెద్ద మొత్తంలో పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధిలో 87 శాతం క్షీణించి 406.71 కోట్ల రూపాయలకు పరిమితమైంది.

04/30/2016 - 08:23

లండన్, ఏప్రిల్ 29: నిరుడు బ్రిటన్‌లోకి భారతీయ పెట్టుబడులు దాదాపు 65 శాతం పెరిగాయి. దీంతో బ్రిటన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డిఐ) అమెరికా, ఫ్రాన్స్ తర్వాత మూడో స్థానంలో భారత్ నిలిచింది. మరోవైపు బ్రిటన్‌లో భారతీయ సంస్థల సంఖ్య కూడా 36 నుంచి 62కు పెరిగింది.

04/30/2016 - 08:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి).. శుక్రవారం 13,030 కోట్ల రూపాయల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్దదైన యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డిఐ విలువే 12,900 కోట్ల రూపాయలు.

04/30/2016 - 08:22

లండన్, ఏప్రిల్ 29: రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్ (ఆర్‌బిఎస్) నికర నష్టాలు ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో గతంతో పోల్చితే రెట్టింపయ్యాయి. నిరుడు 459 మిలియన్ పౌండ్లుగా ఉంటే, ఈసారి 968 మిలియన్ పౌండ్లు (1.4 బిలియన్ డాలర్లు లేదా 1.2 బిలియన్ యూరోలు)గా నమోదయ్యాయి. ఈ మేరకు ఓ ప్రకటనలో ఆర్‌బిఎస్ స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వానికి చెల్లించిన పన్నుల నేపథ్యంలో బ్యాంక్ నష్టాలు రెట్టింపయ్యాయి.

Pages