S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/04/2016 - 05:59

విజయవాడ, జూన్ 3: రోజుకు 18 గంటలు కష్టపతున్న తనను చెప్పులతో కొట్టమని చెప్పే ప్రతిపక్ష నాయకుడు ఉండడం మన దురదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లాలో జగన్ పర్యటిస్తూ చేసిన వ్యాఖ్యలపై సిఎం తీవ్రంగా స్పందించారు. నగరంలో జరిగిన నవనిర్మాణ దీక్ష రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు జగన్‌పై విరుచుకుపడ్డారు.

06/04/2016 - 05:56

విజయవాడ (కార్పొరేటర్), జూన్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం నగరంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకొంది.

06/04/2016 - 05:56

నెల్లూరు, జూన్ 3: తాను చనిపోతూ ఎనిమిది మందికి పునర్జన్మను ప్రసాదించింది ఆ మాతృమూర్తి. మూడు పదులు నిండని వయసులో మరణానికి చేరువవుతూ అవయవదానం చేయడం ద్వారా మరణానికి చేరువలో ఉండే అభాగ్యులకు ప్రాణదానం చేసింది. రాష్ట్రంలోనే తొలిసారి ఇతర అవయవాలతో పాటు ఊపిరితిత్తులను సైతం ఈ ప్రక్రియలో సేకరించడం గమనార్హం.

06/04/2016 - 05:24

అనంతపురం, జూన్ 3 : అనంతపురం జిల్లాలో వైకాపా అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడవ రోజైన శుక్రవారం ఉద్రిక్తతల నడుమ సాగింది. ఈ యాత్రలో భాగంగా జగన్ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర పదజాలంతో దూషించడం వివాదమైంది. దీంతో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎదురుదాడులకు దిగడంతో పరిస్థితి వేడెక్కింది.

06/04/2016 - 05:06

హైదరాబాద్, జూన్ 3: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి ఆరుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆరుగురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఆంధ్రాలో నాలుగు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి నుండి సురేష్‌ప్రభు, టిడిపి నుండి సుజనా చౌదరి, టిజి వెంకటేష్, వైకాపా నుండి విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

06/04/2016 - 04:59

ప్ర: గత 35 ఏళ్ల నుంచి మంత్రి, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, జాతీయ రాజకీయాల్లో కీలకనేతగా పనిచేశారు కదా? అయినా ఇంకా ఈ వయసులో అలసిపోకుండా ఎలా ఉండగలుగుతున్నారు?

06/04/2016 - 08:46

పనిలోనే ఆనందం రాష్ట్ర విభజనలో దగా పడ్డాం
కాంగ్రెస్, కెసిఆర్, జగన్ కుట్రవల్లే జరిగింది
ఉద్యోగులు తరలిరావల్సిందే..రాజీ లేదు లోకేష్‌ను కేబినెట్‌లో తీసుకుంటే తప్పేమిటి?
కేంద్రం నుంచి బయటికి వస్తే లాభమేమిటి? రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం
అందుకే బిజెపికి ఓ ఎంపీ సీటు ఇచ్చాం ఆర్థిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు

06/04/2016 - 04:44

విజయవాడ, జూన్ 3:సచివాలయ ఉద్యోగులంతా జూన్ 27నాటికల్లా తరలిరావాలంటూ సిఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు ఫలించేలా కనిపించడం లేదు. జూన్ 27 నాటికి మూడు వేల మంది ఉద్యోగులు తరలి వస్తారని ముఖ్యమంత్రి, మంత్రులు గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. సౌకర్యాలు లేకపోయినా ఉద్యోగులంతా తరలి వస్తారని ఉద్యోగ సంఘ నేతలు సైతం పదే పదే వల్లె వేశారు.

06/03/2016 - 15:42

విజయవాడ:అప్పులతో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కష్టపడితేనే సాధ్యమని, లేనిపక్షంలో మరింత వెనక్కువెళ్లిపోతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. నిరంతరం కష్టపడుతూంటే ఊహించని విధంగా మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలోని తన నివాసం నుంచి దాదాపు 5వేల మంది అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

06/03/2016 - 07:22

అనంతపురం, జూన్ 2 : తానొక ప్రతిపక్ష నేత అనే విషయాన్ని సైతం మర్చిపోయి వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న జగన్ గురువారం పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామంలో విలేఖరుల సమావేశంలో సిఎం చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు.

Pages