S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/05/2016 - 07:57

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 4: ఆకలిగా వుంటే ఆలోచనలు చేయడం కష్టతరమవుతుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సమస్యల ద్వారానే అవకాశాలు పెరుగుతాయని, సమస్యలను చూసి భయపడకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి లేకుండా రాష్ట్రాన్ని విభజించిందని, రాష్ట్రం మనం కోరుకోకుండా విడిపోయిందన్నారు.

06/05/2016 - 07:55

అనంతపురం (తలుపుల), జూన్ 4:‘ప్రజలను మోసపుచ్చిన వారిని చెప్పుతో కొట్టాలి అని చెప్పడం రాయలసీమలో సహజమని, ఎవరైనా డబ్బు తీసుకుని మోసం చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుతో కొడతామని అంటారని, ఆచరణ సాధ్యం కాని హామీలతో కొట్లాది మంది రాష్ట్ర ప్రజలను మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును చెప్పుతో కొట్టాలనడం తప్పెలా అవుతుందని’ వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

06/05/2016 - 07:10

మచిలీపట్నం, జూన్ 4: కృష్ణా జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. తెల్లవారుఝాము నుండి మధ్యాహ్నం వరకు కురిసిన వర్షానికి జన జీవనం స్తంభించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి ప్రజలు భీతిల్లారు. తీవ్రమైన ఈదురుగాలులు వీయటంతో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాఫిక్, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.

06/05/2016 - 07:09

శ్రీకాకుళం, జూన్ 4: విభజన తర్వాత జరిగిన ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు తెలిసికూడా ప్రతిపక్షం తన పాత్రను సక్రమంగా నిర్వర్తించలేకపోయిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.

06/05/2016 - 07:08

హైదరాబాద్, జూన్ 4: ప్రపంచంలో మనుషుల అవలక్షణాలన్నీ వైకాపా అధినేత వై జగన్మోహన్‌రెడ్డిలోనే ఉన్నాయని ఐటి మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు హైదరాబాద్‌లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జగన్ పిచ్చికుక్క కరిచినట్టు ప్రవర్తిస్తున్నాడని మంత్రి ఆరోపించారు. అవినీతిపై మాట్లాడే నైతిక అర్హత, స్థాయి జగన్‌కు లేదని, వంద జన్మలు ఎత్తినా రాదని పేర్కొన్నారు.

06/05/2016 - 07:07

విజయవాడ, జూన్ 4: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ మరో అడుగు ముందుకు వేసింది. విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందుకోసం కేంద్ర పెద్దలను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ మెట్రో ఫైలును ముందుకు నడిపించుకుంటూ వచ్చింది. మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు ఆమోద ముద్ర లభించాలంటే, అనేక మైలు రాళ్లను దాటాల్సి ఉంటుంది.

06/05/2016 - 07:06

విశాఖపట్నం, జూన్ 4: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్మోహన రెడ్డిపై టిడిపి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి పలువురు ఎమ్మెల్యేలు జగన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు.

06/04/2016 - 08:19

హైదరాబాద్, జూన్ 3: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియను వాయిదా వేయాలని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్‌ను కోరారు. ప్రభుత్వం జూన్ చివరి నాటికి అమరావతి తరలివెళ్లాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిందే తప్ప పూర్తి వివరాలు తమకు ఇవ్వలేదని, దీనిపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇస్తే బావుంటుందని వారు సిఎస్‌కు విజ్ఞప్తి చేశారు.

06/04/2016 - 08:16

హైదరాబాద్, జూన్ 3: విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మించనున్న అంతర్జాతీయ విమనాశ్రయానికి అవరోధాలు తొలిగాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ, హడ్కో, స్పెషల్‌పర్పస్ వెహికల్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కంపెనీ ఉమ్మడిగా ఎంఓయూను ఖరారు చేశాయి. దీని వల్ల హడ్కో ఈ విమానాశ్రయం నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం రూ. 650 కోట్ల రుణాన్ని మంజూరు చేస్తుంది.

06/04/2016 - 08:11

హైదరాబాద్, జూన్ 3: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేక చతికిలపడిన ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు నిలదీసే సమయం వచ్చిందని, అందుకే తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారని, అందులో తప్పుపట్టేందుకు ఏమీ లేదని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఆ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు.

Pages