S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/06/2016 - 07:46

విజయనగరం, జూన్ 5: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులల్లో పనిచేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్ళకు పెంచే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వైద్య సంఘాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ విషయంలో ముఖ్యమంత్రి తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

06/06/2016 - 07:41

కాకినాడ, జూన్ 5: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకంటే అధికంగా నిధులు మంజూరు చేయడానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్రం అందిస్తున్న సహాయంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని కేంద్ర కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు, హైవేలు, ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, మెగాప్రాజెక్ట్‌లను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పనుందన్నారు.

06/06/2016 - 07:36

తిరుపతి, జూన్ 5: ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కెసిఆర్‌ల మధ్య విభేదాలు కొనసాగలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తిరుపతిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇటు చంద్రబాబు కాని అటు కెసిఆర్ కాని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు.

06/06/2016 - 07:35

విజయవాడ, జూన్ 5: హైదరాబా ద్ నుంచి తరలివచ్చే సెక్రటేరియట్ ఉద్యోగులనూ, హెచ్‌ఓడిలనూ కలవరపెడుతున్న అంశం ‘స్థానికత’. రాష్ట్ర విభజన తరువాత విద్యార్థుల స్థానికతను జోన్‌ల వారీగా విభజించారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఉద్యోగులు విజయవాడ రానున్నారు. వారి పిల్లలను విజయవాడలోని స్కూళ్లలో చేర్చనున్నారు. విజయవాడ జోన్-2 పరిధిలోకి వస్తుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు జోన్-2 పరిధిలో ఉన్నాయి.

06/06/2016 - 06:55

విజయవాడ, జూన్ 5: హైదరాబాద్ నుంచి సెక్రటేరియట్ ఉద్యోగులు, హెచ్‌ఓడిలను రాజధాని అమరావతికి తరలింపు అంశం రోజురోజుకూ జటిలమవుతోంది. సిబ్బంది తరలింపుపై ఇటీవలి వరకూ నోరు మెదపని ఉద్యోగ సంఘాలు ఇప్పుడు అమరావతి వెళ్లడానికి ససేమిరా అంటున్నాయి. అమరావతి వెళితే తమకు ఎదురయ్యే కష్టాలను ఒక్కొక్కటిగా ఏకరువు పెడుతున్నారు.

06/06/2016 - 06:49

అనంతపురం, జూన్ 5 : అనంతపురం జిల్లాలో వైకాపా అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర ఐదవ రోజైన ఆదివారం కూడా ఉద్రిక్తతల మధ్య సాగింది. గత నాలుగు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తీవ్రతను మరింత పెంచారు.

06/06/2016 - 06:44

విజయవాడ, జూన్ 5: చెడ్డవారు నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు మంచివారు మాట్లాడకపోవడం విషాదమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదివారం ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వం పాజిటివ్‌గా వెళుతుంటే ప్రతిపక్షం ప్రతికూల ఆలోచనలతో వెళుతోందని, అందుకే ప్రజల విశ్వాసానికి దూరమైందన్నారు.

06/05/2016 - 08:00

కర్నూలు, జూన్ 4: కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం తెల్లవారుజామున భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని 54 మండలాల్లో వర్షం కురవడంతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 3.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో జూన్ నెల సగటు వర్షపాతం 77.20 మిమీ కాగా గత నాలుగు రోజుల్లోనే 47.40 మిమీ వర్షం కురవడం గమనార్హం. వరద నీటితో హంద్రీనది పొంగిపొర్లుతోంది.

06/05/2016 - 07:58

కావలి, మే 4: నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వాణిజ్య పన్నుల కార్యాలయంపై ఏసిబి అధికారులు శనివారం సాయంత్రం దాడి చేయగా ఒక ఆటో మొబైల్ దుకాణం యజమాని నుంచి రూ 80వేలు లంచం తీసుకొంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. స్థానిక రైల్వేరోడ్డు సమీపంలోగల పరితోష ఆటోమొబైల్స్ యజమాని చైతన్య ఫిర్యాదు మేరకు నిఘా వేసి వుంచి ఏసిబి అధికారులు సంబంధిత వ్యక్తి నుంచి నగదు తీసుకొనే సమయంలో వలవేసి పట్టారు.

06/05/2016 - 07:58

కాకినాడ, జూన్ 4: డిజిటల్ ఇండియాతో భారత్ ప్రపంచంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటి శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ చెప్పారు. ఈ విధానంతో దేశంలో సాంకేతికంగా విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయని, నకిలీ రేషన్‌కార్డులు, ఆధార్ కార్డులను తొలగించామని, వివిధ సంక్షేమ పథకాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అమలుచేస్తున్నట్టు చెప్పారు.

Pages