S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/06/2016 - 12:19

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కిడ్నాప్‌కు గురైన అబ్రహాం అనే బాలుడు క్షేమంగానే ఉన్నాడని, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మహిళలను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

06/06/2016 - 12:18

విశాఖ: ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణీకురాలు ఆకస్మికంగా మరణించింది. విశాఖ జిల్లా రావికమతం మండలం నీడివాడ వద్ద బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మరణించినట్లు సహ ప్రయాణీకులు గుర్తించారు. గుండెపోటు వల్లే ఆమె మరణించినట్లు భావిస్తున్నారు. పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

06/06/2016 - 12:17

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతున్నందున కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇక్కడి వాతావరణ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు, రెండు, మూడు రోజుల్లో అవి కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని వారు తెలిపారు.

06/06/2016 - 08:27

హైదరాబాద్, జూన్ 5:సచివాలయం తరలింపుపై అడుగులు తడబడుతున్నాయి. తరలింపు అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి చాలా పట్టుదలతో ఉన్నట్లు గత రెండురోజుల నుంచి ఆయన చేస్తున్న ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. అదే స్థాయిలో ఉద్యోగులు కూడా భీష్మించుకోవడంతో తరలింపు వ్యవహారం ఉత్కంఠగా మారింది.

06/06/2016 - 08:32

కాకినాడ, జూన్ 5: భారత మాతాకు జై నినాదం భారత జాతికి గర్వకారణమని, దురదృష్టవశాత్తూ ఈ నినాదాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ మద్దతివ్వడం దారుణమన్నారు.

06/06/2016 - 07:59

ఎల్‌ఎన్ పేట, జూన్ 5: భూగర్భ జలాలు అభివృద్ధి చేయడం ద్వారా నీటి సమస్యను పరిష్కరించవచ్చని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా, ఎల్‌ఎన్ పేట మండలంలోని సవరకొత్తబాలేరు గిరిజన గ్రామంలో ఆదివారం నీటిగుంతలు, కోయిలాంలో ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సునీత మాట్లాడారు.

06/06/2016 - 07:58

విజయవాడ, జూన్ 5: ప్రతిఒక్కరూ పది మొక్కలు నాటాలని, రాష్ట్రంలోని 5కోట్ల జనాభా ఒక్కొక్కరూ పది మొక్కలు నాటితే 50కోట్ల మొక్కలు పెరుగుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల చేత మొక్కలు నాటించారు.

06/06/2016 - 07:55

విజయవాడ, జూన్ 5: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తాను యజ్ఞం చేస్తుంటే కొందరు రాక్షసుల మాదిరిగా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ల వయస్సు తన అనుభవమంత లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

06/06/2016 - 07:56

హైదరాబాద్, జూన్ 5: రాష్ట్రప్రభుత్వ వివిధ శాఖల్లో పనిచేసే ఉన్నతాధికారులు, ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శాఖపరమైన నైపుణ్యతపై శిక్షణ ఇచ్చేందుకు బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్ధను అన్ని హంగులతో తీర్చిదిద్దాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం షెడ్యూల్ 10లో హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్ధను చేర్చారు.

06/06/2016 - 07:49

నెల్లూరు టౌన్, జూన్ 5: బిసి యువజన సంఘం ఆధ్వర్యంలో గత నెల 28న ఎన్‌టిఆర్ వర్ధంతి రోజు ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర చివరి మజిలీ నెల్లూరుకు ఆదివారం చేరుకుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇంటి ముందు సంకల్ప యాత్ర సభ్యులు ప్రదర్శన నిర్వహించి ఆయన కుటుంబ సభ్యులకు వినతిపత్రం సమర్పించారు.

Pages