S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/07/2016 - 06:48

విశాఖపట్నం, జూన్ 6: పట్టణ ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న భవన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా కొంతమేర వ్యర్థాలను తగ్గించుకోవాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. 10 లక్షల జనాభా దాటిన ప్రతి పట్టణంలోను భవన వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తొలిదశలో విశాఖపట్నం, రాజధాని అమరావతిలో రెండు ప్లాంట్‌లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

06/07/2016 - 06:48

నెల్లూరు, జూన్ 6: ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో దోపిడీ దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను నెల్లూరు సిసిఎస్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నెల్లూరులో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్‌పి విశాల్ గున్నీ ఈ ముఠా సభ్యుల అరెస్ట్, వారిపై నమోదైన కేసుల వివరాలను వివరించారు.

06/06/2016 - 18:10

విజయవాడ: కాపుఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయ కోణంలో పనిచేస్తూ అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. ముద్రగడ చర్యలతో కాపులకే నష్టం జరుగుతుందన్నారు. కాపులకు రిజర్వేషన్ల విషయమై ప్రభుత్వం నియమించిన జస్టిస్ మంజునాథ కమిషన్‌ను ముద్రగడ ఇంతవరకూ ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వల్లే కాపుల సంక్షేమం సాధ్యపడుతుందన్నారు.

06/06/2016 - 18:10

విజయవాడ: ఈనెల 27 నుంచి అమరావతిలో విధులు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎపి రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు సోమవారం తెలిపారు. కొద్దిమంది ఉద్యోగులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఉద్యోగులందరికీ ఆపాదించరాదన్నారు. కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు తగిన వసతి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

06/06/2016 - 18:09

విజయవాడ: పేద ప్రజలకు సేవ చేయడానికి బదులు దీర్ఘకాలంగా సెలవులో ఉంటున్న ప్రభుత్వ వైద్యులను వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలని ఎపి సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఈనెల 8న జరిగే ‘మహాసంకల్పం’ సందర్భంగా ఆయన పలు శాఖల అధికారులతో సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని శాఖలకు లక్ష్యాలను నిర్దేశించామని, ప్రజల ఆకాంక్షల మేరకు అధికారులు పనిచేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.

06/06/2016 - 18:08

ఒంగోలు: విభజన చట్టంలో ఎపికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని, ప్రత్యేకహోదా అనే అంశం ఆ చట్టంలో లేనేలేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సోమవారం ఇక్కడ తెలిపారు. ఎపి ప్రగతికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోందని, ఇప్పటికే పలు ఇరిగేషన్ ప్రాజెక్టులను, విద్యాసంస్థలను మంజూరు చేశామని అన్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఆయన వివరించారు.

06/06/2016 - 18:08

హైదరాబాద్: అనంతపురం ప్రాంతానికి చెందాల్సిన నీటి వనరులను పొరుగు రాష్ట్రాల వారు తరలించుకుపోతున్నా జిల్లాకు చెందిన మంత్రులు నోరు విప్పడం లేదని కాంగ్రెస్ నాయకుడు శైలజానాథ్ విమర్శించారు. ఎంతసేపూ కాంగ్రెస్‌ను నిందించడం తప్ప టిడిపి మంత్రులు చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ఓ కొత్త రాజకీయ విషసంస్కృతికి టిడిపి, వైకాపా నేతలు తెరలేపారని ఆయన అన్నారు.

06/06/2016 - 16:54

విజయవాడ: కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో సోమవారం ఉదయం ఓ ఎస్‌ఐపై, కానిస్టేబుల్‌పై దాడి చేసేందుకు కొందరు రౌడీషీటర్లు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మోహరించి రౌడీ షీటర్ల ఇళ్లలో సోదాలు చేసేందుకు నిర్ణయించారు.

06/06/2016 - 16:54

విజయవాడ: అమరావతికి వెళ్లడానికి ఇష్టం లేని కొద్దిమంది ఉద్యోగులు చేస్తున్న దుష్ప్రచారంతో ఉద్యోగుల సంఘానికి సంబంధం లేదని ఎపి ఎన్టీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఆగస్టు నాటికి అన్ని ప్రభుత్వ విభాగాలు అమరావతికి వెళ్లాల్సిందేనని అన్నారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవనాలతో పాటు ప్రైవేటు భవనాలలోకి ఎపి కార్యాలయాలు వెళతాయని అన్నారు.

06/06/2016 - 16:52

విజయవాడ: కాపుగర్జన సందర్భంగా ఇటీవల తుని వద్ద జరిగిన విధ్వంసకాండకు సంబంధించి పదిమంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. విధ్వంసానికి సాక్షీభూతంగా నిలిచిన సిసి టీవీ ఫుటేజి, వీడియోలు, ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించారు. కడప, గుంటూరుకు చెందిన కొందరు విధ్వంసంలో పాల్గొన్నట్టు ప్రాథమిక సాక్ష్యాలు లభించాయని తెలిసింది.

Pages