S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/29/2016 - 07:07

పర్చూరు, జూన్ 28: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెన్నుబొట్లవారిపాలెం పల్లెలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు అంతా చూస్తుండగానే తండ్రీకొడుకులు గొడ్డళ్లతో పల్లెకు చెందిన ముగ్గురిని దారుణంగా నరికి చంపారు. రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా ఉన్న పాత కక్షలే ఈ హత్యాకాండకు కారణమని భావిస్తున్నారు. ఈ సంఘటనలో కీర్తిపాటి రత్తయ్య (50), జంగా బాబు (45), జంగా సుశీల (40) ప్రాణాలు కోల్పోయారు.

06/29/2016 - 04:50

విశాఖపట్నం, జూన్ 28: విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం మత్స్యకార గ్రామం సాల్మన్‌రాజుపేటలో రెండు వర్గాల మధ్య మంగళవారం చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. రాజయ్యపేటకు చెందిన పలువురు యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి సాల్మన్‌పేట గ్రామస్తులపై దాడిచేశారు. గ్రామంలో చిన్నా,పెద్దా, ఆడ,మగ తేడా లేకుండా దొరికినవారిని దొరికినట్టు గాయపరిచారు. దాడిలో సుమారు 60 మంది వరకూ గాయపడినట్టు తెలిసింది.

06/29/2016 - 04:48

ప్రొద్దుటూరు, జూన్ 28: బడికి వెళ్లిన మొదటి రోజే ఆ చిన్నారిని మృత్యువు కబలించింది. పాఠశాల ఆఫీసు గదిలోని బీరువా మీదపడడంతో ఎల్‌కెజి విద్యార్థిని భార్గవి(5) మృతి చెం దింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం జరిగింది. ప్రొద్దుటూరు పట్టణంలోని వాణీ విద్యానికేతన్ పాఠశాలలో ఎల్‌కెజిలో చేరిన చాపాటి భార్గవి(5) మధ్యాహ్నం భోజన విరామం సమయంలో ఆఫీస్ గదిలోని వెళ్లింది.

06/29/2016 - 04:47

విశాఖపట్నం, జూన్ 28: ప్రభుత్వ శాఖల్లోని ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ స్పష్టం చేశారు. విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా ఎస్సీ,ఎస్టీ పోస్టుల ఖాళీల వివరాలను సేకరించామని, త్వరలోనే వీటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.

06/29/2016 - 04:38

రాజమహేంద్రవరం, జూన్ 28: దేశవ్యాప్తంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) విధానంలో ఫ్లోరీకల్చర్‌ను అభివృద్ధి చేస్తున్నామని జాతీయ వ్యవసాయ పరిశోథనా మండలి (ఐసిఎఆర్) ఉద్యానవన విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టి.జానకిరామ్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నాలుగు రోజులపాటు జరగనున్న 25వ అఖిల భారత పూల సమన్వయ పథకం వార్షిక సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

06/28/2016 - 18:09

చిత్తూరు: చిలమత్తూరు మండలం కొడూరుతోపు సమీపంలో మంగళవారం సాయంత్రం లారీ, వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లు, ఓ విద్యార్థి మరణించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ రెండు వాహనాలు మితిమీరిన వేగంతో ఎదురెదురుగా వస్తూ పరస్పరం ఢీకొన్నట్టు స్థానికులు చెబుతున్నారు.

06/28/2016 - 16:47

విజయవాడ: ప్రభుత్వం ఇస్తున్న అండదండలతో ఎపిలో కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ఆరోపించారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ప్రైవేటు కాలేజీల్లో ఫీజులను నియంత్రించే నాథుడే లేడన్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు కారకుడని అన్నారు. విద్యారంగ సమస్యలపై తమ పార్టీ విద్యార్థుల మద్దతుతో ఉద్యమం చేపడుతుందన్నారు.

06/28/2016 - 16:47

హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో 11.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినందున ఆయనపై అనర్హత వేటు వేయాలని వైకాపా నేతలు ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు మంగళవారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వారు భన్వర్‌లాల్‌కు ఓ వినతిపత్రం సమర్పించారు.

06/28/2016 - 15:40

విశాఖ: దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాలకు ఆనుకుని అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని... దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతాన్ని ఆనుకుని అల్పపీడనం, అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

06/28/2016 - 14:33

ఒంగోలు: ఆస్తిగొడవలు ముగ్గురిని బలిగొన్న ఘటన ప్రకాశం జిల్లా పరుచూరు మండలం చెన్నుభొట్ల గ్రామంలో మంగళవారం జరిగింది. శ్యామ్‌సన్, బోస్ అనే సోదరులు కత్తులతో దాడి చేసి పట్టపగలు నడిరోడ్డుపై తమ మేనమామ రత్తయ్య, మేనత్త సుశీల, మేనల్లుడు బాబులను నరికి చంపారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకుని బోస్, శ్యామ్‌సన్‌లను అరెస్టు చేశారు.

Pages