S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/29/2016 - 12:28

విజయవాడ: రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా సరకుల పంపిణీని ఇక్కడి పంజా సెంటర్‌లో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ బుధవారం ఉదయం ప్రారంభించారు. మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎంపి కేశినేని నాని, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

06/29/2016 - 12:27

విజయవాడ: ఇక్కడి ఇబ్రహీంపట్నంలో రహదారులు, భవనాల శాఖ రాష్ట్ర కార్యాలయాన్ని మంత్రులు శిద్ధా రాఘవరావు, దేవినేని ఉమా బుధవారం ప్రారంభించారు. ఆర్ అండ్ బి శాఖ కార్యకలాపాలు ఇక ఇక్కడి నుంచే సాగుతాయని మంత్రులు తెలిపారు. ఈ కార్యాలయంలో పనిచేసేందుకు సుమారు 400 మంది ఉద్యోగులు హైదరాబాద్ నుంచి తరలివచ్చారు.

06/29/2016 - 07:50

హైదరాబాద్,జూన్ 28: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీని వెంటనే మంజూరు చేయాలని కోరేందుకు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరానితో కలిసి కేంద్రీయ యూనివర్శిటీ అంశాన్ని చర్చిస్తారు. అలాగే తన నియోజకవర్గంలో ఇందుకు స్థలం కూడా ఇచ్చేందుకు సిద్ధం చేశామని ఆయన మంత్రి దృష్టికి తీసుకురానున్నారు.

06/29/2016 - 07:46

హైదరాబాద్, జూన్ 28: అసెంబ్లీ ఎన్నికల్లో తాను రూ. 11.5 కోట్లను ఖర్చుపెట్టినట్లు ఏపి శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చేసిన ప్రకటనపై చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని వైకాపా కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం ఇక్కడ వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

06/29/2016 - 07:43

ఏలూరు, జూన్ 28: పశ్చిమ గోదావరి జిల్లాలో కక్షలు, కార్పణ్యాలకు వేదికైన పినకడిమి వివాదాల నేపథ్యంలో జిల్లా కేంద్రం ఏలూరులో మంగళవారం రాత్రి మరోసారి కిరాయి హంతకులు తెగబడ్డారు. తుపాకులతో జరిపిన కాల్పుల్లో తూరపాటి నాగరాజు అనే వ్యక్తి గాయపడ్డాడు. వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లి తన స్నేహితుని వాహనంపై ఇంటికి తిరిగివెళ్తున్న నాగరాజుపై నలుగురు అగంతకులు రెండు మోటారు సైకిళ్లపై వచ్చి కాల్పులు జరిపారు.

06/29/2016 - 07:42

హైదరాబాద్, జూన్ 28: ఆంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం పనులను స్విస్ చాలెంజ్ పద్ధతిలో విదేశీ కంపెనీలకు కేటాయించడాన్ని ఉపసంహరించుకోవాలని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇక్కడ లోటస్ పాండ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్విస్ చాలెంజ్ విధానాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించలేదన్నారు.

06/29/2016 - 07:41

హైదరాబాద్, జూన్ 28: అది ఏపీ ముఖ్యమంత్రి అధికార కార్యాలయం. ప్రభుత్వానికి సంబంధించి కీలక చర్చలు, నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వ కేంద్రం. అక్కడ పార్టీపరమైన కార్యకలాపాలు చేయడం నిషిద్ధం. కానీ, సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే వాటిని ఉల్లంఘించి మీడియాతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా, అడ్డుకోవలసిన సమాచార శాఖ స్వయంగా సదరు ఎమ్మెల్యేల మీడియా భేటీకి రావాలని సందేశాలు పంపిస్తున్న వైచిత్రి ఇది.

06/29/2016 - 07:10

విజయవాడ/గుంటూరు, జూన్ 28: స్వరాష్ట్రం నుంచి పాలన ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలు సాకారం అవుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పదేళ్ళపాటు హైదరాబాద్‌నే రాజధానిగా వినియోగించుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం వీలైనంత త్వరగా స్వరాష్ట్రం నుంచే పాలన సాగించాలని భావించి, కట్టుబట్టలతో విజయవాడకు చేరుకున్నారు.

06/29/2016 - 07:08

విజయవాడ, జూన్ 28: చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం టియాంజిన్‌నుంచి బీజింగ్ నగరానికి బులెట్ రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా చైనాలోని రైలు కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతి- విశాఖ, అమరావతి- హైదరాబాద్ మధ్య ఈ బులెట్ రైళ్ళను ప్రవేశపెట్టే అవకాశాలను ఆయన పరిశీలించారు. అలాగే విశాఖ- తిరుపతి మధ్య ఒక బులెట్ రైలును నడపాలని చంద్రబాబు ఆలోచన చేశారు.

06/29/2016 - 06:50

కర్నూలు, జూన్ 28: క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే అధికారులకు ఇకపై బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేయనున్నారు. కర్నూలు జిల్లాలో జూలై 1వ తేదీ నుంచి ఈ విధానం అమలుచేయనున్నారు. బయోమెట్రిక్ అమలుతో క్షేత్రస్థాయి పర్యటనల పేర తూతూమంత్రంగా నివేదికలు పంపే అధికారుల్లో దడ మొదలైంది.

Pages