S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/30/2016 - 12:16

ఒంగోలు: రోడ్డుపై ఆగిఉన్న కారును ఓ లారీ ఢీకొట్టడంతో నలుగురు చిన్నారులు సహా డ్రైవర్ మరణించిన ఘటన ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద గురువారం తెల్లవారు జామున జరిగింది. మేదరమెట్ల బైపాస్ రోడ్డులో మరమ్మతుల కోసం కారును డ్రైవర్ నాగరాజు ఆపాడు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన లారీ ఆ కారును ఢీకొంది.

06/30/2016 - 12:15

ఒంగోలు: తాను పనిచేస్తున్న లాడ్జీలో 80 వేల రూపాయలు చోరీ చేయడమే గాక, మిర్చి రైతులకు రెండు కోట్ల రూపాయలు బకాయి పడిన వంచకుడు పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. లాడ్జీలో నగదు చోరీకి సంబంధించి పర్చూరు పోలీసులు ప్రభాకర శర్మ అనే నిందితుడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. రెండు కోట్ల రూపాయల మేరకు మిరపకాయలు కొనుగోలు చేసి రైతులకు బకాయిపడినట్టు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు.

06/30/2016 - 11:44

విశాఖ: మశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. ఆవర్తనం కారణంగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. మరో వైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

06/30/2016 - 08:30

విశాఖపట్నం, జూన్ 29: రాష్ట్ర విద్యా సంక్షేమ వౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఎపిఇడబ్ల్యుఐడిసి) సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ (కేంద్ర బృదం) బుధవారం సోదాలు నిర్వహించింది. గత కొంతకాలంగా ఎస్‌ఇ కర్రి భాస్కరరావుపై తీవ్రమైన ఆవినీతి ఆరోపణలు రావడంతో ఎసిబి కేంద్ర బృందం విస్తృతంగా సోదాలు నిర్వహించింది. సుమారు రూ 1.63 కోట్ల మేర ఆస్తులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు.

06/30/2016 - 08:28

విజయవాడ/గుంటూరు, జూన్ 29: గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం బురదలో చిక్కుకుపోయింది. రెండు రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షాల వల్ల ఈ ప్రాంతమంతా చిత్తడిగా మారింది. సచివాలయానికి నాలుగు వైపులా నడవడానికి వీల్లేనంతగా బురద పేరుకుపోయింది. అసలే నల్లరేగడి భూములు కావటంతో చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతమంతా బురదమయమైపోతోంది.

06/30/2016 - 07:23

విజయవాడ, జూ 29: నవ్యాంధ్రలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చైనాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ సంస్థల ప్రతినిధులను కలుసుకుని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. చైనాలో బుధవారం నాలుగోరోజు పర్యటనలో భాగంగా గిజో జో ప్రావిన్స్‌లోని గియాన్ నగరంలో చంద్రబాబు పర్యటించారు. గిజో ప్రావిన్స్ వైస్ గవర్నర్ క్విన్ రు పీతో భేటీ అయ్యారు.

06/30/2016 - 07:20

విజయవాడ, జూన్ 29: గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలికంగా నిర్మించిన సచివాలయ భవనంలో ఒక బ్లాకును బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఐదవ బ్లాకు గ్రౌండ్ ఫ్లోర్‌లో పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖ మంత్రులు అయ్యన్నపాత్రుడు, మృణాళిని తమ ఛాంబర్లను ప్రారంభించారు. లేబర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ విభాగాన్ని ముఖ్య కార్యదర్శి జి అనంతరామ్ ప్రారంభించారు.

06/29/2016 - 17:30

అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం మధ్యాహ్నం హిందూపురం నుంచి బెంగళూరుకు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఆయన వేరే వాహనంలో బెంగళూరుకు వెళ్లారు.

06/29/2016 - 17:27

గుంటూరు: గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఉద్యోగుల సందడి మొదలైంది. సచివాలయం అయిదో నెంబర్ భవనం కింది అంతస్థును రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ఇక్కడ విధులు నిర్వహించేందుకు హైదరాబాద్ నుంచి అయిదు ప్రత్యేక బస్సుల్లో సచివాలయ సిబ్బంది తరలివచ్చారు.

06/29/2016 - 14:20

హైదరాబాద్: నగరంలోని ఎపి సచివాలయంలో అయిదు శాఖలకు చెందిన ఉద్యోగులు బుధవారం నవ్యాంధ్ర రాజధాని అమరావతికి 5 ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు. కార్మిక, వైద్య-ఆరోగ్యం, పంచాయితీరాజ్, గృహనిర్మాణ శాఖలకు చెందిన ఉద్యోగులు ఇక్కడి నుంచి తరలివెళ్లారు. వెలగపూడి వద్ద నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో వీరు రేపటి నుంచి సేవలందిస్తారు.

Pages