S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/01/2016 - 05:34

విశాఖపట్నం, జూన్ 30 : గుంటూరు జిల్లా అమరావతిలోని అమరేశ్వరుని దేవస్థానానికి అనుంబంధంగా ఉన్న చెన్నైలోని సదావర్తి సత్రం భూములను కారు చౌకగా వేలంలో కొంతమంది దక్కించుకున్నారంటూ వైకాపా నేతలు వివాదాస్పదం చేస్తున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్.రామానుజయ ఆరోపించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆ సత్రానికి చెందిన 83 ఎకరాలను వేలం వేసిందని గుర్తు చేశారు.

07/01/2016 - 02:47

హైదరాబాద్, జూన్ 30: ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా ఎస్ సెంథిల్ కుమార్‌ను అదే పోస్టులో కొనసాగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరో బెటాలియన్ ఎపిఎస్‌పి కమాండెంట్‌గా గోపినాథ్ జెట్టిని కొనసాగిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రంలోని ఏడు స్పెషల్ సిఎస్ పోస్టులను ఏడాది పాటు కొనసాగిస్తూ మరో రెండు ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.

07/01/2016 - 02:46

హైదరాబాద్, జూన్ 30: ఈ ఏడాది అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు గుజరాత్‌లోని వడోదరలో అంతర్జాతీయ విద్యుత్ పరికరాల ప్రదర్శనను నిర్వహించనున్నట్లు గుజరాత్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ తెలిపింది. విద్యుత్ రంగంలో నిపుణులు ఈ ప్రదర్శనకు హాజరుకానున్నారు. దాదాపు ఒక లక్ష మంది ఈ ప్రదర్శనను సందర్శించనున్నారు. ఈప్రదర్శనలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పాల్గొనేందుకు ముందుకు వచ్చాయన్నారు.

07/01/2016 - 02:44

హైదరాబాద్, జూన్ 30: ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచిన విధానాన్ని ఇతర కేటగిరీ ఉద్యోగులకు వర్తింప చేసే విషయమై కూలంకషంగా విచారించాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ కేసును సంపూర్ణంగా విచారించకుండా పిటిషనర్లు కోరినట్లుగా కార్పొరేషన్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

07/01/2016 - 02:42

హైదరాబాద్, జూన్ 30: ఏపిలో ఎనిమిది దేవాలయాల్లో పనిచేసే సిబ్బంది పదవీవిరణమపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సర్వీసుల్లో కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. దేవాలయాల్లో పనిచేసే సిబ్బంది పదవీవిరమణ వయస్సు 58 సంవత్సరాలే నంటూ సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది.

06/30/2016 - 17:48

కర్నూలు: హైకోర్టు విభజన విషయమై తెలంగాణ న్యాయవాదులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ఎపిలో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి అన్నారు. నవ్యాంధ్ర రాజధానిలో సకల సౌకర్యాలతో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయం కేంద్రం పరిధిలో ఉన్నందున దిల్లీలో దీక్ష చేస్తానని తెలంగాణ సిఎం కెసిఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.

06/30/2016 - 17:47

గుంటూరు: ఎపి రాజధానికి ప్రభుత్వ శాఖల తరలింపులో భాగంగా మహిళా,శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ కార్యాలయాన్ని గుంటూరులో గురువారం ప్రారంభించారు. ఆ శాఖ మంత్రి పీతల సుజాత పాలు పొంగించి ఆఫీసులో అడుగుపెట్టారు. త్వరలోనే తమ శాఖకు చెందిన కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయని ఆమె తెలిపారు.

06/30/2016 - 17:47

విజయవాడ: తెలంగాణ సిఎం కెసిఆర్ తన అసమర్ధతను కప్పిపుచ్చేందుకు న్యాయవ్యవస్థను తప్పుపట్టడమే కాకుండా, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని టిడిపి ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ గురువారం ఆరోపించారు. హైకోర్టు విభజన కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడానికి బదులు ఆంధ్రా జడ్జీలను వెనక్కి పంపాలంటూ తెలంగాణ న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు కెసిఆర్ మద్దతు ఇవ్వడం తగదన్నారు.

06/30/2016 - 17:46

విశాఖ: ఓ వృద్ధ దంపతులు బంధువుల వద్దకు వెళ్లగా దొంగలు పడి ఇంట్లో బంగారం, వెండి, నగదు దోచుకున్న ఘటన ఇక్కడి అక్కయ్యపాలెం నర్సింహనగర్‌లో జరిగింది. ఆ దంపతులు గురువారం ఉదయం తమ ఇంటికి వచ్చి చూడగా బీరువాలో 18 తులాల బంగారం, 25 తులాల వెండి నగలు, 13వేల నగదు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

06/30/2016 - 15:10

విజయవాడ: ఓ కేసు సందర్భంగా తరచూ పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తూ తమను వన్‌టౌన్ ఎస్‌ఐ, ఓ కానిస్టేబుల్ వేధిస్తున్నారని ఆరుగురు వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం గుడివాడలో జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన నాగమణి, షేక్ రహీం అనే వ్యక్తులను పోలీసులు తరచూ పిలిపించుకుని విచారణ చేస్తున్నారు.

Pages